ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ది రాజకీయ దుష్ప్రచారమే!

ఓటరు జాబితా ప్రక్షాళనతో ప్రజాస్వామ్యం మరింత బలోపేతం: పోరెడ్డి కిషోర్‌రెడ్డి హుస్నాబాద్‌, నవంబర్‌ 4 (చైతన్యగళం): ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.. అరాచక శక్తులను తరిమికొడదాం’ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌ పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎల్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం రాత్రి మేధావుల సదస్సు నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై కాంగ్రెస్‌ పార్టీ, దాని మిత్రపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నాయని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టి, ఎస్‌ఐఆర్‌పై వాస్తవాలను ప్రజలకు వివరించాలనే...