హైదరాబాద్, నవంబర్ 04 (చైతన్యగలం):
మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రవళిక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.