ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించేది లేదు

వసతి గృహాలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్, నవంబర్ 2(చైతన్యగళం): ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజావాణిలో అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. ప్రభుత్వ వసతి గృహాలు, విద్యాసంస్థల నిర్వహణపై ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి తనిఖీ నివేదికలను వెంటనే సమర్పించాలని సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ఆహార పట్టిక ప్రకారం...