ఘనంగా సినిమా పాటల పోటీలు
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి గానంతో అలరించిన గాయకులు మహబూబాబాద్ గాయకుడు రేణుకుంట్ల లక్ష్మీకాంతారావుకు ఘన సన్మానం ఖమ్మం(చైతన్యగళం): శ్రీ భక్త రామదాసు స్టేజి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సినిమా పాటల పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఖమ్మం పట్టణంలోని అతిథి హోటల్‌లో సంస్థ అధ్యక్షుడు రాగమయి రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం, హైదరాబాద్, కోదాడ, కల్లూరు, ముదిగొండ, ఎర్రుపాలెం, సూర్యాపేట, మహబూబాబాద్ తదితర ప్రాంతాల నుంచి గాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ చిత్రాల్లోని మధురమైన గీతాలను ఆలపిస్తూ తమ గాన...