మట్టి తరలింపుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి

హుస్నాబాద్ ప్రాంతంలో గుట్టలు మాయమవుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జునరెడ్డి హుస్నాబాద్, నవంబర్ 3 (చైతన్యగళం): ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తూ కొందరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో హుస్నాబాద్ ప్రాంతంలో గుట్టలకు గుట్టలు మాయమవుతున్నాయని, అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మట్టిని తరలించేందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని కూడా అధికారులు విచారించడం లేదన్నారు. కాంట్రాక్టు పనులకు మట్టి...