వేముల ఏకకోండలు మృతికి ఘన నివాళి
మిర్యాలగూడ, నవంబరు 2(చైతన్యగళం): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సుందర్నగర్ శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులు, మిత్రబృందం వేముల ఏకకోండలు అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ఏకకోండలుతో తమకున్న అనుబంధాన్ని, ఆయన పంచిన ఆప్యాయతను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. ఆయనతో కలిసి గడిపిన క్షణాలు, మధుర జ్ఞాపకాలు తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆయన భౌతికంగా దూరమైనా జ్ఞాపకాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ...