CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 11:04 am Posted by : CHAITHANYA GALAM NEWS

వేముల ఏకకోండలు మృతికి ఘన నివాళి

మిర్యాలగూడ, నవంబరు 2(చైతన్యగళం): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సుందర్‌నగర్‌ శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులు, మిత్రబృందం వేముల ఏకకోండలు అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ఏకకోండలుతో తమకున్న అనుబంధాన్ని, ఆయన పంచిన ఆప్యాయతను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. ఆయనతో కలిసి గడిపిన క్షణాలు, మధుర జ్ఞాపకాలు తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆయన భౌతికంగా దూరమైనా జ్ఞాపకాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సంతాపం తెలిపిన వారిలో బుడిగ నరసింహనాయుడు (వెంకన్న), వల్లపట్ల వినోద్, బండి సైదులు, జానపాటి విక్రమ్, వజ్జగిరి వెంకన్న, గడ్డం సైదులు, పోలా వెంకటేశ్వర్లు (పీ.వీ.టీ), బండి శీను, రోశయ్య, శేఖర్, విజయ్, నాగబాబు, రామాంజనేయులు తదితరులు ఉన్నారు.

ఓం శాంతి.. శాంతి.. శాంతిః