CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 11:08 am Posted by : CHAITHANYA GALAM NEWS

వేముల ఏడుకొండలుకు మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు నివాళి

  • మిర్యాలగూడ, నవంబర్ 2 (చైతన్యగళం):

పట్టణంలోని 18వ వార్డు సుందర్‌నగర్‌కు చెందిన వేముల ఏడుకొండలు (43) గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆయన నివాసానికి చేరుకుని పార్ధివదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్ది శ్రీనివాస్ గౌడ్, వల్లంపట్ల వినోద్, దుర్గారావు, వేముల లాలయ్య, ఆది చంద్రమోహన్, వేముల సుధాకర్, గుంజ కొండల్, వెంకన్న, బుడిగ నరసింహనాయుడు, రాములు, పిచ్చయ్య, సతీష్, శివకుమార్, బండి సైదులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.