విద్యారంగ సమస్యలను పరిష్కరించి.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
పిపిఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈదుల రామాంజనేయులు డిమాండ్ మహబూబాబాద్, అక్టోబర్ 31 (చైతన్యగళం): విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పిపిఎల్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఈదుల రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మహబూబాబాద్ జిల్లా హనుమంతునిగడ్డలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో పిపిఎల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర వనరుల ప్రతినిధి ఐనాల పరశురాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ఈదుల రామాంజనేయులు, రాష్ట్ర కన్వీనర్...