హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
రైతుల పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలి: బీఆర్‌ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు పెరుక భాగ్యరెడ్డి హుస్నాబాద్, అక్టోబర్ 31 (చైతన్యగళం): హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. మెట్ట ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవడంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ విఫలమయ్యారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు పెరుక భాగ్యరెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం నుంచి గోదావరి...