ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలి

నవంబర్‌ 3న హుస్నాబాద్‌లో మేధావుల సదస్సు, 5న కరీంనగర్‌లో బండి సంజయ్‌ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి: కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి హుస్నాబాద్‌, అక్టోబర్‌ 31 (చైతన్యగళం): ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి బీజేపీ కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని, కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియ, ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన...