CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 9:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలి

  • నవంబర్‌ 3న హుస్నాబాద్‌లో మేధావుల సదస్సు, 5న కరీంనగర్‌లో బండి సంజయ్‌ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి: కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 31 (చైతన్యగళం): ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి బీజేపీ కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని, కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియ, ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా నవంబర్‌ 3న హుస్నాబాద్‌లో నిర్వహించనున్న మేధావుల సదస్సును, నవంబర్‌ 5న కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ చేపట్టనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ఈ నేపథ్యంలో శనివారం హుస్నాబాద్‌ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్‌లో బీజేపీ పట్టణ సమావేశం నిర్వహించారు. బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నవంబర్‌ 3, 5 తేదీల్లో జరగనున్న కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. హుస్నాబాద్‌ పట్టణం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసి కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యతలను పట్టణ స్థాయి పైమెన్‌ కమిటీకి అప్పగించారు.

ఈ కమిటీలో లక్కిరెడ్డి తిరుమలరెడ్డి, కొత్తపల్లి అశోక్‌, దొడ్డి శ్రీనివాస్‌, తోట స్వరూప, విలసాగరం మురళీమోహన్‌లను సభ్యులుగా నియమించారు. పట్టణంలోని పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ రెండు కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా కృషి చేయాలని కోరారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడం, కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రచారంపై వాస్తవాలను ప్రజలకు వివరించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని సమావేశంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపును, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సూచనలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి రెండు కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఖమ్మం వేంకటేశం కోరారు.

ఈ సమావేశంలో బీజేపీ నాయకులు వడ్లకొండ రవికుమార్‌రెడ్డి, గంగిశెట్టి గాంధీ, తగురం లక్ష్మణ్‌, రాయికంటి చందు, కాయితం అరుణ్‌రెడ్డి, ఇల్లందుల తిరుపతి, పెందోట భుశంకరచారి, బత్తుల చంద్రమౌళి, బోడిగే వెంకటేష్‌, గౌరవేని మనెమ్మ, వేల్పుల నాగార్జున, కాదాసు దీపిక, మల్లం ప్రశాంత్‌, పోలోజు రవీందర్‌, సుద్దాల నరేష్‌, బోనగిరి రవీందర్‌, ఎర్రోజు సాయికృష్ణ, పుదారి శ్రీనివాస్‌, నందకుమార్‌, కాదాసు నరేష్‌, కోట రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.