CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 11:10 am Posted by : CHAITHANYA GALAM NEWS

టీపీటీఎఫ్‌ ఎల్కతుర్తి మండల నూతన కార్యవర్గం ఎన్నిక

  • అధ్యక్షుడిగా బి. సారయ్య, ప్రధాన కార్యదర్శిగా పి. సదయ్య ఏకగ్రీవ ఎన్నిక

ఎల్కతుర్తి, అక్టోబర్‌ 30 (చైతన్యగళం):

తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) ఎల్కతుర్తి మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండల అధ్యక్షుడిగా బి. సారయ్య, ప్రధాన కార్యదర్శిగా పి. సదయ్య ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా జె. లక్ష్మయ్య, పరిశీలకులుగా ఈ. కుమారస్వామి వ్యవహరించారు. ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షుడు బి. సారయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, మండలంలో సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తానని తెలిపారు.

ప్రధాన కార్యదర్శి పి. సదయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల హక్కులు, సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, టీపీటీఎఫ్‌ సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.