కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ భారీ ప్రదర్శన

ఘనంగా 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. కేక్‌ కట్‌ చేసి సంబరాలు మహబూబాబాద్, అక్టోబర్‌ 31 (చైతన్యగళం): అఖిల భారత ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ) 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది కార్మికులతో గ్రీన్‌ మార్కెట్‌ నుంచి కోర్టు సెంటర్‌ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి. అజయ్‌ సారధి రెడ్డి, ప్రధాన కార్యదర్శి...