- ఘనంగా 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. కేక్ కట్ చేసి సంబరాలు
మహబూబాబాద్, అక్టోబర్ 31 (చైతన్యగళం):
అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది కార్మికులతో గ్రీన్ మార్కెట్ నుంచి కోర్టు సెంటర్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి. అజయ్ సారధి రెడ్డి, ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య ఉద్యమంలోనూ కార్మికులను సంఘటితం చేసి పోరాటాలు చేసిన చరిత్ర ఈ సంఘానికి ఉందన్నారు. దేశంలోని తొలి కార్మిక సంఘంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేపట్టిందని పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆటో, సెకండ్‌హ్యాండ్ ఆటో, లారీ, పౌరసరఫరాల తదితర రంగాలకు చెందిన కార్మికులకు ఏఐటీయూసీ అండగా నిలుస్తోందని చెప్పారు. వీధి వ్యాపారుల సమస్యలపై పోరాటాలు నిర్వహించడంతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అంగన్‌వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు కల్పించాలని, ఆశా కార్యకర్తల వేతనాలు పెంచాలని నిరంతరం ఉద్యమాలు చేపట్టినట్లు వివరించారు.
కార్మికుల వేతనాల పెంపు, హక్కుల సాధన, సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ ఏఐటీయూసీ ముందుండి పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. 107 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సంఘం కార్మిక లోకానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెలుగు శ్రావణ్, మంద శంకర్, తండా శ్రీనాథ్, జకరయ్య, చిక్కల సోమయ్య, చిర్ర లక్ష్మీనరసింహ, పుచ్చకాయల రజిని, రెహమాన్, యూసుఫ్, యాకూబ్ పాషా, రవీందర్, మహేందర్, ముత్యాలు, కవిత, భాస్కర్, సురేష్, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, కేదాసు రమేష్, అజ్మీర వేలు, ఆబోతు అశోక్, శ్రీను తదితరులు ప