CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 11:11 am Posted by : CHAITHANYA GALAM NEWS

11వ వార్డులో కోతుల బెడద నివారణకు చర్యలు

  • మున్సిపల్‌ ఆధ్వర్యంలో కోతులను పట్టించే కార్యక్రమం

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 30 (చైతన్యగళం):

హుస్నాబాద్‌ పట్టణంలోని 11వ వార్డులో కోతుల బెడద నివారణకు మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలతో పాటు వార్డులోని పలు ప్రాంతాల్లో కోతుల సంచారంతో ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం కోతులను పట్టించే కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి, 11వ వార్డు కౌన్సిలర్‌ పూదరి వరప్రసాద్‌ మాట్లాడుతూ కోతుల వల్ల ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు విద్యాసంస్థల్లో విద్యార్థుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ సంపత్‌ నాయక్‌, కోఆప్షన్‌ సభ్యురాలు సరోజన, మున్సిపల్‌ శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ బాల్‌ ఎల్లం, రవికుమార్‌, 11వ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.