పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

పట్టణ పరిశుభ్రతకు విశేష సేవలందించిన ఐదుగురికి పురస్కారం హుస్నాబాద్‌, అక్టోబర్‌ 31 (చైతన్యగళం): హుస్నాబాద్‌ పురపాలక సంఘ కార్యాలయంలో ఉమెన్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ విభాగం పరిధిలోని మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధి పద్మ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉత్తమ సేవలందించిన జవాన్‌ పైసా శ్రీకాంత్‌, సిబ్బంది ఆకారపు యాదమ్మ, ఆకారపు పద్మ, ముక్కెర శంకరయ్య, మంద సుధాకర్‌లను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా...