ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి
అడ్డుకునేందుకు వెళ్లిన మరో విద్యార్థినికి గాయాలు.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు రాప్తాడు, అక్టోబర్ 31 (చైతన్యగళం): అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై పాఠశాలలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తి చెట్ల కొమ్మలు కోసే రంపంతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. పాఠశాల ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు సమాచారం....