మహబూబాబాద్‌ రైల్వే అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ పోరిక బలరాం నాయక్‌ వినతి న్యూఢిల్లీ (చైతన్యగళం): మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో రైల్వే సమస్యలను పరిష్కరించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ పోరిక బలరాం నాయక్‌ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో ఎంపీ పోరిక బలరాం నాయక్‌, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌ రెడ్డి తదితరులు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు....