విద్యార్థుల భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన
మహిళా భద్రత, సైబర్ నేరాలు, బాలల హక్కులపై అవగాహన మహబూబాబాద్, అక్టోబర్ 30 (చైతన్యగళం): విద్యార్థుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, అప్రమత్తతతోనే నేరాల నుంచి రక్షణ పొందవచ్చని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ పి. శబరీష్ ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ఫాతిమా హైస్కూల్‌లో షీ టీం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం...