నవంబర్‌ 2న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘాలతో చర్చలు

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి దామోదర రాజనర్సింహ హామీ హైదరాబాద్ (చైతన్యగళం): రాష్ట్రవ్యాప్తంగా గత 18 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నవంబర్‌ 2న ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరుపుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఫోరం గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ కరుణాకర్‌ లునావత్‌ ఆధ్వర్యంలో ఫోరం నాయకులు హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలను...