గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లేవి.. కరువు మండలాల గుర్తింపేదీ?
రైతులకు అన్యాయం జరుగుతోంది: బీజేపీ నేత పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ హుస్నాబాద్, అక్టోబర్ 29 (చైతన్యగళం): గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, కరువు మండలాల ప్రకటనలోనూ రైతులకు అన్యాయం చేస్తోందని బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ విమర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోని రైతుల సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో నీళ్లు లేవని, రైతులకు అవసరమైన విత్తనాలు అందడం లేదని ఆరోపించారు. గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న...