పందిల్ల టోల్‌గేట్ వద్ద రోడ్డు ప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం
అసంపూర్తి పనులు, రోడ్డు గుంతలపై ప్రయాణికుల ఆందోళన హుస్నాబాద్ రూరల్, అక్టోబర్ 29 (చైతన్యగళం): హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న టోల్‌గేట్ సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై గుంతలు ఉండటంతో అటుగా వెళ్తున్న స్విఫ్ట్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పగా, కారు తీవ్రంగా దెబ్బతింది. టోల్‌గేట్ నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడం, రోడ్డుపై గుంతలు ఏర్పడటం, వాహనదారులను అప్రమత్తం చేసే హెచ్చరిక బోర్డులు...