రాష్ట్రీయ ఏక్తా దివస్ ఉత్సవానికి కరీంనగర్ బృందం
గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో అక్టోబర్ 31న జరిగే వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం కరీంనగర్, అక్టోబర్ 29 (చైతన్యగళం): గుజరాత్ రాష్ట్రంలోని ఏక్తానగర్‌లో అక్టోబర్ 31న నిర్వహించనున్న రాష్ట్రీయ ఏక్తా దివస్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన తొమ్మిది మందిని జిల్లా యంత్రాంగం ఎంపిక చేసింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వీరంతా గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అదనపు డీసీపీ పి. వెంకట రమణ ఆధ్వర్యంలో గుజరాత్‌కు బయలుదేరారు. ఈ బృందంలో పెండ్యాల కేశవరెడ్డి, అన్నవరం దేవేందర్, ఏ. కిరణ్ కుమార్, సింగిరెడ్డి...