అధికారంలోకి వస్తేనే బహుజనుల జీవితాల్లో మార్పు

రాజకీయ అధికారమే సమస్త సమస్యల పరిష్కారానికి మార్గం: బీఎస్పీ నేతలు తాండూరు, అక్టోబర్ 29 (చైతన్యగళం): దశాబ్దాలుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం కోసం పోరాడుతున్న బహుజనుల జీవితాల్లో నిజమైన మార్పు రావాలంటే రాజకీయ అధికారం సాధించడం ద్వారానే సాధ్యమని బహుజన్‌ సమాజ్‌ పార్టీ చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి సయ్యద్‌ అమీర్‌, వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కట్టెల మల్లేశం అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణయ్య గౌడ్‌ అధ్యక్షతన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...