ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
ఉద్యోగుల పోరాటానికి బీఎస్పీ సంపూర్ణ మద్దతు రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 28 (చైతన్యగళం): జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారికి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్లలో ఆందోళన చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సిరిసిల్లలో కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన శిబిరాన్ని బీఎస్పీ నాయకులు సందర్శించి, వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు....