ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభం

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలి: కార్పొరేటర్‌ మాసం గణేష్‌ కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం): కరీంనగర్‌ నగరంలోని పోచమ్మవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అల్పాహార పథకాన్ని కార్పొరేటర్‌ మాసం గణేష్‌ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ, పోషకాహారంతో కూడిన అల్పాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవడంతోపాటు మంచి నడవడికను అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర...