వెట్టిచాకిరీ కార్మికుల గుర్తింపు, విముక్తి, పునరావాసానికి ప్రత్యేక చర్యలు

అర్హులైన బాధితులకు ప్రభుత్వ సహాయం సకాలంలో అందించాలి.. అధికారులకు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశం నాగర్‌కర్నూల్, అక్టోబర్ 28 (చైతన్యగళం): నాగర్‌కర్నూల్ జిల్లాలో వెట్టిచాకిరీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వెట్టిచాకిరీకి గురవుతున్న కార్మికులను గుర్తించి, వారికి విముక్తి కల్పించడంతోపాటు ఆర్థిక సహాయం, పునరావాసం అందించి వారి హక్కులను పరిరక్షించాలని సూచించారు. ఈ దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. బుధవారం నాగర్‌కర్నూల్‌లోని...