రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక
400 మీటర్ల పరుగులో రజతం.. 100 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్యం హుస్నాబాద్, అక్టోబర్ 28 (చైతన్యగళం): హుస్నాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు క్రీడా రంగంలో ప్రతిభ చాటారు. సిద్దిపేట జిల్లా స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) పోటీల్లో పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 400 మీటర్ల పరుగు పందెంలో ఓ. విగ్నేష్ రజత పతకం సాధించగా, 100 మీటర్ల హర్డిల్స్ పోటీలో విష్ణు వర్ధన్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి...