పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువు
అర్హులైన పట్టభద్లులందరూ నమోదు చేసుకోవాలి: అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ సిద్దిపేట, అక్టోబర్ 28 (చైతన్యగళం): వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు అర్హులైన పట్టభద్రులందరూ గడువులోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ కోరారు. ఓటరు నమోదు ప్రక్రియకు నవంబర్ 6 చివరి తేదీ అని స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని చేర్యాల, ధూల్మిట్ట, మద్దూరు, కొమురవెల్లి మండలాలు వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోకి...