ఉప్పల అంజమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నివాళులు

యాచారం, అక్టోబర్ 28 (చైతన్యగళం): రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఉప్పల భాస్కర్‌ తల్లి ఉప్పల అంజమ్మ ఇటీవల మృతి చెందడంతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మంగళవారం సాయంత్రం యాచారం మండల కేంద్రంలోని ఉప్పల భాస్కర్‌ నివాసానికి వెళ్లారు. అంజమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భాస్కర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో యాచారం మండల మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, పీఏసీఎస్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ నాయిని సుదర్శన్‌రెడ్డి,...