CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 12:26 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఉప్పల అంజమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నివాళులు

యాచారం, అక్టోబర్ 28 (చైతన్యగళం): రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఉప్పల భాస్కర్‌ తల్లి ఉప్పల అంజమ్మ ఇటీవల మృతి చెందడంతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మంగళవారం సాయంత్రం యాచారం మండల కేంద్రంలోని ఉప్పల భాస్కర్‌ నివాసానికి వెళ్లారు. అంజమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భాస్కర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో యాచారం మండల మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, పీఏసీఎస్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ నాయిని సుదర్శన్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు ఈసీ శేఖర్‌ గౌడ్‌ మామ, సేవాదళ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంకాల దాస్‌, కాంగ్రెస్‌ పార్టీ యాచారం మండల అధ్యక్షుడు మోటే శ్రీశైలం, తక్కళ్లపల్లి సర్పంచ్‌ మారేడుపల్లి నరేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పోలమోని రామకృష్ణ యాదవ్‌, నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు గోరిగే హరికిషన్‌, యాచారం మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు పాశం జయప్రకాష్‌, గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు కేశమోని బిక్షపతిగౌడ్‌, రెడ్డి సుధీర్‌రెడ్డి, బోయినపల్లి వెంకటేష్‌, వార్డు సభ్యులు నారిమళ్ల శ్రీకాంత్‌, నారిమళ్ల వెంకటేష్‌, ఎం.విక్రమ్‌, షేక్‌ ఫాజిల్‌, మచ్చ జంగయ్య, బి.శ్యామ్‌, గణేష్‌, చింటూ తదితరులు పాల్గొన్నారు.