విద్యార్థులకు సురక్షిత బాల్యంపై న్యాయ అవగాహన

సైబర్‌ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించిన సీనియర్‌ సివిల్‌ జడ్జి అపర్ణ మల్లాది మంథని, అక్టోబర్‌ 28 (చైతన్యగళం): విద్యార్థులు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాలల రక్షణకు ఉద్దేశించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మంథని సీనియర్‌ సివిల్‌ జడ్జి అపర్ణ మల్లాది సూచించారు. మంథని మండలం ఇగ్లాస్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ‘సురక్షిత బాల్యం’ అనే అంశంపై న్యాయ విజ్ఞాన అవగాహన సమావేశం నిర్వహించారు. అక్టోబర్‌ 26 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న న్యాయ...