CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 10:30 pm Posted by : CHAITHANYA GALAM NEWS

విద్యార్థులకు సురక్షిత బాల్యంపై న్యాయ అవగాహన

  • సైబర్‌ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించిన సీనియర్‌ సివిల్‌ జడ్జి అపర్ణ మల్లాది

మంథని, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

విద్యార్థులు సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాలల రక్షణకు ఉద్దేశించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మంథని సీనియర్‌ సివిల్‌ జడ్జి అపర్ణ మల్లాది సూచించారు. మంథని మండలం ఇగ్లాస్‌పూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ‘సురక్షిత బాల్యం’ అనే అంశంపై న్యాయ విజ్ఞాన అవగాహన సమావేశం నిర్వహించారు.

అక్టోబర్‌ 26 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న న్యాయ విజ్ఞాన కార్యక్రమాల్లో భాగంగా ఈ సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా జడ్జి అపర్ణ మల్లాది బాల్యంలో చిన్నారులు ఎదుర్కొంటున్న సైబర్‌ నేరాలు, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే పోక్సో చట్టం గురించి అవగాహన కల్పిస్తూ, పిల్లల భద్రతకు సంబంధించిన హక్కులు, చట్టపరమైన రక్షణలపై విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గొల్లపల్లి జ్యోతి, న్యాయవాదులు రగోతమరెడ్డి, కటకం శ్రీనివాస్‌, శశిభూషణ్‌, కాచే కన్నూరి శ్రీహరి, రెడ్ల సతీష్‌, చిత్రా రెడ్డి, అశోక్‌ రెడ్డి, జనిరాల శేఖర్‌, కె. వాసకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.