కరీంనగర్‌ జిల్లాను సంపూర్ణ కరువు జిల్లాగా ప్రకటించాలి

కరువు మండలాల జాబితాను సవరించాలి.. పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ కరీంనగర్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం): కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా రైతాంగం కరువు పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా అశాస్త్రీయంగా కరువు మండలాలను ప్రకటించడం అన్యాయమని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా అశాస్త్రీయంగా...