శ్రీ యజ్ఞవరాహస్వామి 40వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావుకు ఆహ్వాన పత్రిక అందజేత కరీంనగర్ టౌన్, అక్టోబర్ 28 (చైతన్యగళం): కరీంనగర్‌లోని సర్వవైదిక సంస్థానమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యజ్ఞవరాహ క్షేత్రంలో శ్రీ యజ్ఞవరాహస్వామి 40వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు అక్టోబర్ 28వ తేదీ బుధవారం నుంచి నవంబర్ 2వ తేదీ సోమవారం వరకు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావును ఆయన క్యాంపు కార్యాలయంలో...