విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం భోగేశ్వర్‌ కరీంనగర్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం): ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) కరీంనగర్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం భోగేశ్వర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని, రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యావ్యవస్థను లేకుండా చేస్తామని హామీ...