మాదకద్రవ్యాల నివారణకు సమష్టి కార్యాచరణ

అన్ని శాఖల సమన్వయంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ రాజన్న సిరిసిల్ల, అక్టోబర్‌ 28 (చైతన్యగళం): జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఎస్పీ మహేష్‌ బి. గితేతో కలిసి ఆమె జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నియంత్రణ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న ఎన్‌డీపీఎస్‌ కేసులు, గంజాయి సాగు నివారణకు తీసుకుంటున్న చర్యలు, శాఖల వారీగా...