మైనారిటీ గురుకుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా భూపేందర్‌ కౌర్‌

టీఎస్‌యుటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఉపాధ్యాయులకు కీలక బాధ్యతలు కరీంనగర్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యుటీఎఫ్‌–టీజీఎంఆర్‌ఈఐఎస్‌) మైనారిటీ గురుకుల విభాగం రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులకు కీలక బాధ్యతలు లభించాయి. హైదరాబాద్‌లోని టీఎస్‌యుటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధ్యక్షతన, రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన టీఎంఆర్‌ఈఐఎస్‌ ఉపాధ్యాయురాలు భూపేందర్‌...