CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 9:54 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మైనారిటీ గురుకుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా భూపేందర్‌ కౌర్‌

  • టీఎస్‌యుటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఉపాధ్యాయులకు కీలక బాధ్యతలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యుటీఎఫ్‌–టీజీఎంఆర్‌ఈఐఎస్‌) మైనారిటీ గురుకుల విభాగం రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులకు కీలక బాధ్యతలు లభించాయి. హైదరాబాద్‌లోని టీఎస్‌యుటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధ్యక్షతన, రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన టీఎంఆర్‌ఈఐఎస్‌ ఉపాధ్యాయురాలు భూపేందర్‌ కౌర్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, డాక్టర్‌ ఓల్లాల శ్రీనివాస్‌ రాష్ట్ర కార్యదర్శిగా, రేవోజు స్వామి సామాజిక మాధ్యమాల విభాగం ఇన్‌చార్జిగా, జి. సంధ్య రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు రాష్ట్ర నాయకులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ టీఎంఆర్‌ఈఐఎస్‌లో పనిచేస్తున్న రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తూ, ప్రతి ఉద్యోగికి సంఘం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టీఎస్‌యుటీఎఫ్‌ సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు ఉపాధ్యాయుల సంక్షేమం, ఐక్యత, సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.