మంత్రి సొంత నియోజకవర్గంలోనే అద్దె భవనంలో బీసీ బాలికల వసతి గృహం!
ప్రభుత్వానికి విద్యార్థినుల సమస్యలు పట్టవా? సొంత భవనం మంజూరు చేయాలి: ఏబీవీపీ నేత సావుల ఆదిత్య హుస్నాబాద్, అక్టోబర్ 28 (చైతన్యగళం): బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్‌లోనే ప్రభుత్వ బీసీ బాలికల పోస్టుమెట్రిక్ వసతి గృహం అద్దె భవనంలో కొనసాగడం బాధాకరమని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సావుల ఆదిత్య విమర్శించారు. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం, సొంత భవనాన్ని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి...