కరువు మండలాల జాబితాపై బండి సంజయ్ ఆగ్రహం
లోటు వర్షపాతం ఉన్న మండలాలను ఎందుకు విస్మరించారు? అర్హులైన రైతులకు న్యాయం చేయాలి కరీంనగర్, అక్టోబర్ 28 (చైతన్యగళం): కరువు మండలాల ఎంపికలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యధిక లోటు వర్షపాతం నమోదైన అనేక మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాల జాబితాలో చేర్చకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కరువు మండలాల ఎంపిక అశాస్త్రీయంగా జరిగిందనే అనుమానాలు జాబితాను పరిశీలిస్తే కలుగుతున్నాయని అన్నారు. హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు,...