ఇబ్రహీంపట్నం కోర్టుకు నూతన భవనం, రహదారి సౌకర్యం కల్పిస్తాం
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 27 (చైతన్యగళం): ఇబ్రహీంపట్నం కోర్టుకు నూతన భవనం నిర్మించడంతో పాటు, కోర్టుకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం కల్పించే అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. మంగళవారం ఇబ్రహీంపట్నంలో బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన ఆయన న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రస్తుత కోర్టు భవనం స్థానంలో నూతన భవన నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు....