నీటిని పొదుపుగా వినియోగించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి
ప్రజలు నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలి: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) జమ్మికుంట, అక్టోబర్ 27 (చైతన్యగళం): ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) సూచించారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, నీటి వృథాను అరికట్టి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. ప్రతిరోజూ నల్లాల ద్వారా సరఫరా చేసే నీటిని అవసరమైనంత మాత్రమే...