ఎన్‌హెచ్‌-563పై అండర్‌పాస్‌ నిర్మించాలి

పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు.. ప్రజావాణిలో కలెక్టర్‌కు శ్రీనివాస్‌నగర్‌ గ్రామస్తుల వినతి మానకొండూర్‌, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): జాతీయ రహదారి 563పై అండర్‌పాస్‌ నిర్మించి, రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని మానకొండూర్‌ మండలం శ్రీనివాస్‌నగర్‌ గ్రామ రైతులు, గ్రామస్తులు కోరారు. ఈ మేరకు సోమవారం గ్రామ సర్పంచ్‌ ఎరుకల శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ భూములు జాతీయ రహదారికి అవతలివైపు ఉండటంతో పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. పశువులను తీసుకెళ్లాలన్నా సమస్యలు...