యువత మత్తుకు దూరంగా ఉండి మైదానాల వైపు రావాలి
‘ఖేలో తెలంగాణ’లో యువత, విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలి: ఎంపీ ఎం. అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్, అక్టోబర్ 27 (చైతన్యగళం): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఎం. అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ క్రీడా శాఖ చేపట్టిన ‘ఖేలో తెలంగాణ’ కార్యక్రమంలో యువత, విద్యార్థులు నిరంతరం పాల్గొనాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా క్రీడలు, శారీరక దారుఢ్యంపై అవగాహన కల్పిస్తున్న తెలంగాణ క్రీడా శాఖను...