CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 10:05 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

  • ప్రయాణికులకు స్వల్ప గాయాలు.. ఆసుపత్రిలో పరామర్శించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు

మిర్యాలగూడ, అక్టోబర్‌ 27 (చైతన్యగళం):

మిర్యాలగూడ పట్టణ శివారులోని ఏడుకోట్ల తండా వద్ద నార్కట్‌పల్లి–అద్దంకి రాష్ట్ర రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ నుంచి మిర్యాలగూడ వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి, అంబులెన్స్‌ ద్వారా క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనపై మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన ప్రయాణికులకు పరామర్శ

ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికులను డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ (బాలు) పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు దేశిడి శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.