డిసెంబర్ నెలాఖరులోగా 550 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి
నిర్మాణ పనుల్లో జాప్యం వద్దు.. నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ నాగర్‌కర్నూల్, అక్టోబర్ 27 (చైతన్యగళం): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న 550 పడకల ఆసుపత్రి పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆసుపత్రి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణం ఏ మేరకు పూర్తయింది, పెండింగ్‌లో ఉన్న...