నూతన డీఈఓను కలిసిన టీజీహెచ్ఎంఏ ప్రతినిధులు
కరీంనగర్, అక్టోబర్ 26 (చైతన్యగళం): నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా విద్యాశాఖాధికారి వై. తిరుపతిరావును టీజీహెచ్ఎంఏ కరీంనగర్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి విద్యారంగ అభివృద్ధిపై చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు ప్రాథమిక స్థాయిలో చదవడం, గణిత నైపుణ్యాలను పెంపొందించాలని డీఈఓ సూచించారు. ఎల్‌నినో ప్రభావాలు, నీరు, విద్యుత్తు పొదుపు, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారంపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీజీహెచ్ఎంఏ కరీంనగర్ అధ్యక్షుడు పోలాడి లక్ష్మణరావు, కార్యదర్శి మియాపురం మధుసూదనాచారి, కర్ర అశోక్‌రెడ్డి, ఎంఈఓలు జ్యోతి, జయప్రద, ప్రధానోపాధ్యాయులు చంద్రకళ,...