రూ.15 కోట్లతో ఓదెల మల్లన్న ఆలయ పునర్నిర్మాణం

అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్‌ విజయరమణ రావు ఓదెల, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. ఓదెల మల్లన్న ఆలయంలో రూ.15 కోట్ల వ్యయంతో చేపడుతున్న పునర్నిర్మాణ పనులతోపాటు ఇతర అభివృద్ధి పనులను మంగళవారం ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి, సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు...